Jagarlamudi Krish – I Salute…

      ఊరు: సువిశాల ప్రపంచం,
తేదీ: మీరు చదివే రోజు.

గౌరవనీయులైన జాగర్లమూడి రాధాకృష్ణ  (Krish) గారికి,
                 తమ విధేయుడు, వీరాభిమాని ఐన ఆకాశరామన్న అత్యంత గౌరవ మర్యాదలతో నమస్కరించి వ్రాయునది. ఉభయ కుశలోపరి.
                సినిమా అంటే “తెర మీద తోలుబొమ్మలాట” గా తయారైన ఈ రోజుల్లో “ఆ ప్రతీ బొమ్మ వెనుకా ఒక బ్రతుకు ఉంది” అని నమ్మేలాంటి కథలు మాకందిస్తున్నందుకు మీకు నా కృతఙతలు. పేద, ధనిక వర్గాల జీవన విధానాలు రెండిటినీ ఒక రెండు చక్రాల బండి ఎక్కించి తీసుకు వెళుతూ గమ్యాన్ని చూపించారు.  నాలుగు జీవితాల వేరు వేరు కథల్ని ఒక చోట చేర్చి జీవన వేదం చూపించారు. దేవుడి దశావతారాలను మనిషి లోని భావోధ్వేగాలతో జోడించి కృష్ణం వందే జగద్గురుం అనిపించారు. ఇప్పుడు ఒకనాటి జీవన శైలి లో వర్గాల మధ్యా, కులాల మధ్యా, దేశాల మధ్యా, దేహాల మధ్యా కట్టుకున్న కంచెలను కన్నులు తడిసేలా చూపించారు.
               మీ కల లో మెదిలిన కథని, మీ కలానికున్న కళ ని, నాలుగు గోడల మధ్య చీకటి గది లో వెలిగే తెరపై చూసిన మా కన్నులు మీకు ప్రతినిమిషం కృతఙతలు చెప్పుకుంటూనే ఉన్నాయండీ…  సినిమాలు చాల మంది చూపిస్తారు. కాని విలువలు కొందరే చూపిస్తారు. అందులో మీరు ప్రప్రథములు సుమండీ!
                   మిమ్మల్ని ఈ సినిమా పరంగా చాలా విష్యాలకి అభినందించాలండీ…  ముందుగా చారిత్రక యుద్ధ నేపధ్యం లో ఎన్నో సినిమలు తీసిన తెలుగు సినీ రంగం యెన్నడూ ముట్టుకోడానికి సాహసించని ప్రపంచ యుద్ధం అనే నేపధ్యాన్ని మొదటిసారిగా మాకు పరిచయం చేసినందుకు… రెండవది..; కత్తి పట్టుకున్న ఫ్యాక్షనిస్టుని, తుపాకీ పట్టుకున్న బందిపోటుని కూడా హీరో ని చేసిన మన తెలుగు సినిమా ధూపాటి హరిబాబు లాంటి ఒక నిజమైన హీరోని యేనాడూ హీరో గా తెర మీద పరిచయం చేయలేకపోయింది. మీరు అది చేసారు… ప్రేమంటే అమ్మాయిని ఇష్టపడడం, పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకొవడం, ధైర్యం ఉంటే లేచిపోవడం, భయం ఉంటే మర్చిపోవడం మాత్రమే కాదు. అమ్మాయి తనతో లేకపొయినా ఆ ఙ్యాపకాలతో ప్రయాణించడం.., ప్రతీ క్షణం తలుచుకోవడం.., మురిసిపోవడం… “సింహం బ్రతికినా వెయ్యే.. చచ్చినా వెయ్యే…” ఇక్కడ కూడా ఆ పాత్రలు చనిపోయినా ప్రేమ ని బ్రతికించారు… ఈ కాలం లో నిజమైన ప్రేమకథ అని చెప్పుకోదగ్గ సినిమా యేదైనా ఉంది అంటే అది మీదేనండీ…
                    హీరోని బట్టి, ఖర్చు ని బట్టి, ఐటెం పాటల బట్టి కాకుండా విలువలను బట్టి, కథను బట్టి,కథకుడిని బట్టి సినిమాలు ఆడే రోజులు మీతోనే మొదలౌతాయని నాకెందుకో మనస్పూర్తిగా అనిపిస్తుందండీ… వ్యాపార విలువలు మాత్రమే ప్రథానాంశాలుగా పరిగణించబడే ఈ రోజుల్లో ఆ పద్ధతి ని పూర్తిగా మార్చగలిగే మీలాంటి రచయితలు, దర్శకులు ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి ప్రభంజనాలు శృష్టించాలని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మరింతమంది కథకి, విలువలకి ప్రాథాన్యత ఇచ్చే దర్శకులు పైకి రావాలని ఆశిస్తున్నామండీ…
                   మీకు మరిన్ని విజయాలు చేకూరాలని, ఎన్నో ప్రశంశలు అందుకోవాలని, దేశం మొత్తం గర్వించదగ్గ స్థాయికి మీరు యెదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను… ఆరోగ్యం జాగ్రత్త సుమండీ!
ఇట్లు,

aakasaramanna

 • VishNu Teja G

  Nice one…

  • Nani Kalla

   Thnq Vishnu

 • chandan

  Got involved with it…, Thanq NANI.

  • Nani Kalla

   Thanq so much Chandan garu 🙂

 • Sridhar Allenki

  Nice narration….well done nani . keep positing .. 🙂

  • Nani Kalla

   Thnq so much Sridhar garu 🙂

 • Sarvasiddi Gayatri Gowthami

  Chaala Chakaga rasav Nani Sariga cheypav Kadakudu illanti padunna kadhalatho ravali ani.. ni ee leykha lo prati oka amsani neynu ekibhavistunanu nani santhosam 100 yellu vardillu nani babu ni ee akasarammana entho ethuki edagali ani asirwadistu me akka gayatri 🙂

Free WordPress Themes, Free Android Games